ఇంటర్‌లో ఫెయిలైనా.. ఐఏఎస్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో ఫెయిలైనా.. ఐఏఎస్‌

Apr 12 2026 2:42 AM | Updated on Apr 12 2026 2:42 AM

ఇంటర్‌లో ఫెయిలైనా.. ఐఏఎస్‌

శంకరపట్నం: సక్సెస్‌కు మార్కులే కొలమానం కాదని నిరూపించారు ప్రస్తుత హైదరాబాద్‌ మెట్రోవాటర్‌బోర్డు ఎండీ కోరెం అశోక్‌రెడ్డి. ఇంటర్‌ ఫెయిలైన అశోక్‌రెడ్డి.. తర్వాత పట్టవదలని విక్రమార్కుడిలా పుస్తకాలతో కుస్తీ పట్టి గ్రూప్‌–1 సాధించారు. ప్రస్తుత కన్‌ఫార్మ్‌డ్‌ ఐఏఎస్‌ అధికారి హోదాలో సేవలందిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన కోరెం అశోక్‌రెడ్డి మొలంగూర్‌ జెడ్పీ హైస్కూల్‌లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. హుజూరాబాద్‌ జూనియర్‌ కాలేజీ ఇంటర్‌ చదివారు. సెకండియర్‌లో ఫెయిల్‌ అయినా సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయ్యారు. జమ్మికుంటలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసి గ్రూప్‌–1 ఉద్యోగానికి ఎంపికయ్యారు. సీ్త్రశిశుసంక్షేమశాఖ పీడీగా ఉద్యోగంలో చేరి, కన్‌ఫార్మ్‌డ్‌ ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రోవాటర్‌ బోర్డు ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మార్కులు, ర్యాంకులు కొలమానం కాదని పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని అశోక్‌రెడ్డి అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement