హెల్త్‌ క్యాంప్‌నకు స్పందన | - | Sakshi
Sakshi News home page

హెల్త్‌ క్యాంప్‌నకు స్పందన

Apr 11 2026 4:13 PM | Updated on Apr 11 2026 4:13 PM

పవర్‌ కట్‌ ప్రాంతాలు

కరీంనగర్‌: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం కరీంనగర్‌లోని రాంనగర్‌ ఆయుష్‌ హాస్పిటల్‌లో నిర్వహించిన మెగా హెల్త్‌ క్యాంప్‌కు విశేష స్పందన లభించింది. హెల్త్‌క్యాంపును డీఎంహెచ్‌వో వెంకటరమణ, అడిషనల్‌ డీఎంహెచ్‌వో సుధా ప్రారంభించారు. మెడికల్‌ ఆఫీసర్లు యశ్రబ్‌ సుల్తానా, శేఖర్‌, సదానందం, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

రామయ్య హుండీ లెక్కింపు

ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల హుండీని ఎండోమెంట్‌ కరీంనగర్‌ డివిజన్‌ పరిశీలకుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం లెక్కించారు. రూ.20,39,551లక్షల ఆదాయం వచ్చిందని ఇన్‌చార్జి ఈవో కందుల సుధాకర్‌ తెలిపారు. ఆరు గ్రాముల మిశ్రమ బంగారం, 225 గ్రాముల వెండి వచ్చినట్లు సుధాకర్‌ తెలి పారు. అర్చకుడు శేషం వంశీధరచార్యులు, నవీన్‌ కుమార్‌ శర్మ, మోహన్‌, మల్లారెడ్డి, సు రేందర్‌రావు, రమేశ్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

పత్తి మార్కెట్‌కు సెలవు

జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్లో పత్తి ధర స్వల్పంగా తగ్గింది. గురువారం రూ.8000 పలికిన ధర శుక్రవారం రూ.100 తగ్గి క్వింటాల్‌కు రూ.7,900 పలికింది. మార్కెట్‌కు ఆరు వాహనాల్లో 69 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. శని, ఆదివా రాలు సాధారణ సెలవులు ఉంటాయని సోమవారం యథావిధిగా కొనుగోళ్లు జరుగుతాయని ఇన్‌చార్జి కార్యదర్శి రాజా తెలిపారు.

16న జాబ్‌మేళా

విద్యానగర్‌(కరీంనగర్‌): జిల్లాలోని నిరుద్యోగ యువతకు కరీంనగర్‌లోని టాటా మోటార్స్‌, ధని టెక్నాలజీ సొల్యూషన్‌లో ఉద్యోగాలు కల్పించడానికి ఈనెల 16న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతి రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ చదివిన ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలు, సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. వివరాలకు 9908530384 నంబర్‌లో సంప్రదించాలని అన్నారు.

విదేశాల్లో ఉద్యోగావకాశాలు

విద్యానగర్‌(కరీంనగర్‌): భవన నిర్మాణ కార్మి కులకు, వారి పిల్లల్లో అర్హులైన వారికి విదేశాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా ఉప కార్మిక కమిషనర్‌ కోల ప్రసాద్‌ తెలిపారు. నమోదైన నిర్మాణ కార్మికుల పిల్లల్లో 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండి 8వ తరగతి విద్యార్హత ఉన్న వారికి విదేశీ భాష, సాఫ్ట్‌స్కిల్స్‌ శిక్షణ అందించి, ఉద్యోగాలకు అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపా రు. ఆసక్తి ఉన్నవారు ఆధార్‌, లేబర్‌ కార్డుతో సంప్రదించాలని సూచించారు.

కొత్తపల్లి: విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపుతో పాటు నిర్వహణ పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కె.వీ.కమాన్‌ ఫీడర్‌ పరిధిలోని కోతిరాంపూర్‌, లక్ష్మీనగర్‌, అమీర్‌నగర్‌, గాయత్రీనగర్‌, పోచమ్మ ఆల యం, పార్వతినగర్‌, వరసిద్ధినగర్‌, అన్నమనేని గార్డెన్‌, సెయింట్‌ మేర్రీస్కూల్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌ 1 ఏడిఈ పంజాల శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

బొమ్మకల్‌, కొత్తపల్లి, రేకుర్తిలో

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ల నిర్వహణలో భాగంగా శనివారం ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు 33/11 కె.వీ.బొమ్మకల్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని శ్రీపురం కాలనీ, రజ్వీచమన్‌, సిటిజన్‌కాలనీ, ప్రియదర్శినికాలనీ, క్రిష్ణనగర్‌, ఆటోనగర్‌, ధర్మనగర్‌, బైపాస్‌ రోడ్‌, బొమ్మకల్‌, గుంటూర్‌పల్లి, దుర్శేడ్‌, గోపాల్‌పూర్‌, నల్లగుంటపల్లి, మరియాపూర్‌, సలాపినగర్‌ ప్రాంతాలతో పాటు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొత్తపల్లి, రేకుర్తి సబ్‌స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్‌ రూరల్‌ ఏడీఈ గాదం రఘు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement