డంప్‌యార్డ్‌ తొలగించాలని మోకాళ్లపై నిరసన | - | Sakshi
Sakshi News home page

డంప్‌యార్డ్‌ తొలగించాలని మోకాళ్లపై నిరసన

Apr 11 2026 4:13 PM | Updated on Apr 11 2026 4:13 PM

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలోని డంప్‌యార్డ్‌ను తొలగించాలంటూ శుక్రవారం నగరపాలకసంస్థ కార్యాలయం ఎదుట డంప్‌యార్డ్‌ బాధితులు మోకాళ్లపై కూర్చొని ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేశారు. మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. డంప్‌యార్డ్‌ నుంచి వెలువడుతున్న దుర్వాసనలు, హానికరవాయువులు, పొగ వల్ల సమీప ప్రాంత డివిజన్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్త గుట్టలు,, దోమలతో డెంగీ, మలేరియా వ్యాధుల ముప్పు పెరిగిపోతుందన్నారు. డంప్‌యార్డ్‌ను నగరానికి దూరంగా, ప్రజల నివాస ప్రాంతాలకు హాని కలగని ప్రదేశానికి తరలించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement