అయ్యో కొడుకా.. మాకు దిక్కెవరు? | - | Sakshi
Sakshi News home page

అయ్యో కొడుకా.. మాకు దిక్కెవరు?

Jul 8 2024 12:04 AM | Updated on Jul 8 2024 9:49 AM

అయ్యో కొడుకా.. మాకు దిక్కెవరు..

అయ్యో కొడుకా.. మాకు దిక్కెవరు..

హైదరాబాద్‌ రోడ్డు ప్రమాదంలో మెట్‌పల్లి యువకుడి దుర్మరణం

కరీంనగర్: దంపతులకు ఒక్కగానొక్క కొడుకు. వివాహమైన తర్వాత కొన్నేళ్లకు జన్మించిన అతన్ని ఎంతో అల్లారు ము ద్దుగా పెంచారు. ఇంజినీరింగ్‌ విద్య కోసం హైదరాబాద్‌కు పంపారు. ఉన్నత ఉద్యోగం పొంది వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటాడని ఆశ పడ్డారు. కానీ విధి కన్నెర్ర చేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ యువకుడిని కబలించి వారికి అంతులేని దుఃఖాన్ని మిగిల్చింది. 

వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని కళానగర్‌కు చెందిన బాసని రవి–లక్ష్మీ దంపతులకు కుమారుడు వంశీ(20) ఉన్నాడు. హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. మీర్‌పేట వద్ద అదుపుతప్పి కింద పడ్డారు.

ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ వంశీ అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని ఆదివారం మెట్‌పల్లికి తీసుకురాగా.. తల్లిదండ్రులు కొడుకా.. ఇక మాకు దిక్కెవరంటూ కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

Advertisement
 
Advertisement
Advertisement