అపహరణకు గురైన కుక్క ఇదే
పెంపుడు కుక్కను అపహరించారని పోలీసులకు ఫిర్యాదు
నల్గొండ, మిర్యాలగూడ: తన పెంపుడు కుక్కను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారని ఓ వ్యక్తి సోమవారం మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిర్యాలగూడ పట్టణంలోని వినోభానగర్‌కు చెందిన గడ్డం నాగరాజు పెంచుకుంటున్న కుక్క ఈ నెల 18వ తేదీ నుంచి కనిపిండంలేదు. దీంతో అతడు కాలనీలో సీసీ కెమెరాలను పరిశీలించగా.. వినోభానగర్ చర్జి రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కుక్కను ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించాడు. కుక్క ఆచూకీ లభించకపోవడంతో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన కుక్కను తీసుకొచ్చి ఇస్తే రూ.10వేల వరకు బహుమతిని ఇస్తానంటూ నాగరాజు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం విశేషం.


