రూ.25 లక్షల కార్‌ లోన్‌ తీసుకుని.. కారే అమ్మేసిన మోసగాడు | Car loan Defaulter Sells Financed Car Bank Files Police Complaint | Sakshi
Sakshi News home page

రూ.25 లక్షల కార్‌ లోన్‌ తీసుకుని.. కారే అమ్మేసిన మోసగాడు

Jul 21 2026 11:38 AM | Updated on Jul 21 2026 2:12 PM

Car loan Defaulter Sells Financed Car Bank Files Police Complaint

కర్ణాటక: నగరంలో రూ. 25 లక్షల బ్యాంకు రుణంతో కారు కొని, దానిని అక్రమంగా వేరొకరికి అమ్మేసిన రుణగ్రహీత ఉదంతమిది. వివరాలు.. మధు మోహన్‌ అనే వ్యక్తి సరస్వతీపురంలోని ఎస్‌బిఐ బ్యాంక్‌ శాఖ నుంచి రూ. 25 లక్షల రుణం తీసుకున్నాడు. ఆ తర్వాత అతను ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేదు. దీంతో, రుణాన్ని వసూలు చేయడానికి బ్యాంకు సిబ్బంది మధు మోహన్‌ ఇంటికి వెళ్లినప్పుడు, అతను అందుబాటులో లేడు. పైగా కారును బ్యాంకు నుంచి అనుమతి తీసుకోకుండా, రవాణా అధికారుల నకిలీ సంతకాలతో రికార్డులను తారుమారు చేశాడు, ఆ కారును షకీబ్‌ మన్సూర్‌ అనే వ్యక్తికి అమ్మినట్లు తేలింది. దోషులపై చర్యలు తీసుకోవాలని బ్యాంకు సిబ్బంది  సరస్వతీపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement