ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డికి తప్పిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డికి తప్పిన ప్రమాదం

Jun 13 2023 10:52 AM | Updated on Jun 13 2023 10:52 AM

- - Sakshi

మానకొండూర్‌: ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డికి ప్రమాదం తప్పింది. అతడు ప్రయాణిస్తున్న ఫార్చునర్‌ కారు ద్విచక్రవాహనదారుడిని ఢీ కొని, అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. బెలూన్స్‌ ఓపెన్‌కావడంతో కౌశిక్‌రెడ్డి, గన్‌మెన్లు, డ్రైవర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన మానకొండూర్‌ మండలం శంషాబాద్‌ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తనకారులో సోమవారం ఉదయం కరీంనగర్‌ నుంచి హుజూరాబాద్‌ బయల్దేరా డు.

మానకొండూర్‌ మండలం శంషాబాద్‌ చేరుకోగానే అదే గ్రామానికి చెందిన బూస సంపత్‌ ద్విచక్రవాహనంతో రోడ్డు దాటుతుండగా కౌశిక్‌రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చునర్‌ కారు అతడిని ఢీకొట్టింది. కారు డ్రైవర్‌ అప్రమత్తమై కుడివైపు తిప్పగా.. రోడ్డు కిందకు దిగింది. రెండు చెట్లను ఢీకొట్టబోతుండగా డ్రైవర్‌ తప్పించడంతో చిన్నపాటి కందకంలో దిగింది. కారు ముందుభాగం దెబ్బతింది.

ప్రమాదసమయంలో కౌశిక్‌రెడ్డి ముందుసీట్లో కూర్చుకున్నాడు. బెలూన్స్‌ ఓపెన్‌కావడంతో కారులోని వారికి ప్రమాదం తప్పింది. ద్విచక్రవాహనదారుడికి గాయాలు కాగా.. కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. కౌశిక్‌రెడ్డి మరోకారులో హుజూరాబాద్‌ వెళ్లిపోయారు. కాగా.. కౌశిక్‌రెడ్డి డ్రైవర్‌ అతివేగంగా, అజాగ్రత్తగా కా రు నడపడంతో తనతండ్రి ప్రమాదానికి గురయ్యాడని సంపత్‌ కొడుకు మహేందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజ్‌కుమార్‌ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement