న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2026
నింగి.. నీరు.. నీలం
ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి అరకొర వర్షాలతో లోయర్ మానేరు డ్యాంలో నీటిమట్టం లేక మైదానాన్ని తలపించింది. ఇటీవల ఎల్లంపల్లి ద్వారా మిడ్ మానేరుకు అక్కడి నుంచి లోయర్ మానేరుకు నీరు సరఫరా చేయడంతో జలకళను సంతరించుకుంటోంది. గురువారం సాయంత్రం వర్షం కురిసే ముందు ఆకాశం మొత్తం నీలి రంగులోకి మారగా.. మానేరులోని నీరు సైతం నీలిరంగులో కనిపించింది. ఈ దృశ్యం ప్రకృతి ప్రియులను ఆకట్టుకుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్
కరీంనగర్‌టౌన్: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ఆందోళన నిర్వహించిన విద్యార్థినాయకులను పోలీసులు సీపీటీసీకి తరలించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజనీకాంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్నారు. బకాయిలు రాక కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. కరీంనగర్ సైన్స్ కళాశాలకు నూతన భవనం నిర్మించడంతో పాటు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. గజ్జెల శ్రీకాంత్, కంపెల్లి అరవింద్, మానస, సంజన, వినయ్ సాగర్, సురేశ్, సందేశ్, రాకేష్, సన్నీ, మణికంఠ, జాన్సన్ రిషి, ఓంకార్, అభి, అర్ఫన్, నితిన్, సిరివెన్నెల, సాత్విక, అమూల్య పాల్గొన్నారు.


