కరీంనగర్‌టౌన్: నగరంలోని ముకరంపురంలోని ఓల్డ్ హైస్కూల్ క్యాంపస్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ బా లుర హాస్టల్‌ను, డాక్టర్ స్ట్రీట్‌లోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌ను గురువారం కలెక్టర్ చిత్రామిశ్రా పరిశీలించారు. అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో లీకేజీలు, కిచెన్ షెడ్డు, తాగునీరు, టాయిలెట్లు తదితర వసతులపై సమస్యలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయ్యే వరకు అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులను ముకంరపురంలోని ఓల్డ్ హైస్కూల్ క్యాంపస్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌కు తరలించి, అక్కడే హాస్టల్ వసతితో పాటు తరగతులు నిర్వహించాలన్నారు. హాస్టల్‌ను పరిశీలించి కొద్దిరోజుల పాటు విద్యార్థులను జాగ్రత్తగా చూసుకుంటూ, తరగతులు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్‌రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆరుతడి పంటల సాగుపై దృష్టి
జిల్లాలో ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేలా దృష్టి సారించాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించా రు. గురువారం రాత్రి తన చాంబర్‌లో వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గత సంవత్సరం ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం, ప్రస్తుతం సాగు చేసిన విస్తీర్ణం వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతేడాది జిల్లాలో సుమారు 6 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు కాగా, ఈ సంవత్సరం ఇప్పటివరకు 16వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. మొక్కజొన్న, వేరుశనగ, ఆయిల్‌పామ్‌తో పాటు కూరగాయలు, పండ్ల తోటల సాగుపై రైతులు ఆసక్తి చూపేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఏవో భాగ్యలక్ష్మి, హుజూరాబాద్ వ్యవసాయ అధికారి భూంరెడ్డి, జమ్మికుంట వ్యవసాయ అధికారి ఖాదర్ హుస్సేన్ పాల్గొన్నారు.


