మురికినీటి నిర్వహణకు మ్యాజిక్‌ డ్రెయిన్‌ | - | Sakshi
Sakshi News home page

మురికినీటి నిర్వహణకు మ్యాజిక్‌ డ్రెయిన్‌

Jul 18 2026 3:41 AM | Updated on Jul 18 2026 3:41 AM

పైలట్‌ ప్రాజెక్ట్‌ను పరిశీలించిన కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

జనగామ రూరల్‌: మురికినీటి నిర్వహణకు మ్యాజిక్‌ డ్రెయిన్‌ విధానం అమలుచేస్తున్నామని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా తెలిపారు. పైలట్‌ ప్రా జెక్ట్‌గా మండలంలోని వడ్లకొండ గ్రామంలో చేపడుతున్న మ్యాజిక్‌ డ్రెయిన్‌ నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మ్యాజిక్‌ డ్రెయిన్‌ విధానంలో మొత్తం 30 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు వేర్వేరు సోక్‌ పిట్లు ఏర్పాటు చేసి, నీరు సహజసిద్ధంగా భూమిలోకి ఇంకిపోయేలా తగిన వాలుతో నిర్మా ణం చేపట్టడం జరుగుతుందన్నారు. నీటి ప్రవాహం ఎక్కడా నిలిచిపోకుండా గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా సజావుగా సాగేందుకు ప్రత్యేక డిజైన్‌ అనుసరిస్తారని తెలిపారు. ఈ పరిశీలనలో డీఆర్డీఓ భాస్కర్‌, ఈజీఎస్‌ పీడీ సూరి, ఎంపీడీఓ మహేష్‌ నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement