సంస్కృతి, సంప్రదాయాలను పాటించండి | - | Sakshi
Sakshi News home page

సంస్కృతి, సంప్రదాయాలను పాటించండి

Jul 21 2026 1:18 AM | Updated on Jul 21 2026 1:18 AM

జనగామ: సంస్కృతి, సంప్రదాయాలను పాటించడం ప్రతి ఒక్కరికీ శ్రీరామ రక్ష అని త్రిదండి చిన్న జీయర్‌ స్వామి అన్నారు. పట్టణంలోని బాణాపురం వెంకటేశ్వరస్వామి సన్నిధిలో జరుగుతున్న తృతీయ పుష్కర మహోత్సవాలు, మహా సుదర్శన యాగంలో భాగంగా సోమవారం విశేష సహస్రనా మార్చన, సుదర్శన హవనం, దంపతీ పూజలు, ఉగ్రరథ, భీమరథ, సహస్ర చంద్రదర్శన హవనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న జీయర్‌ స్వామి మాట్లాడుతూ.. నక్షత్రాలు, తిథులు, కాలం అనుకూలంగా ఉండాలంటే పూర్వీకులు అందించిన సంప్రదాయాలను ఆచరించాలని సూచించారు. అనంతరం స్థానిక కవుల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు.

రేపు బండగుట్టకు చిన్న జీయర్‌స్వామి

లింగాలఘణపురం: మండలంలోని బండగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి ఈ నెల 22న చిన్నజియర్‌స్వామి రానున్నారు. 32 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహంతో పాటు శంఖు చక్ర నామాలను ఆవిష్కరించనున్నారని ఉత్సవ నిర్వాహుకులు వంచ మహేశ్వర్‌రెడ్డి, లింగాల దీపక్‌రెడ్డి, వంచ రాంరెడ్డి తెలిపారు.

జ్యూడీషియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఎన్నిక

జనగామ రూరల్‌: డిస్ట్రిక్ట్‌ జ్యూడీషియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిభ, నూతన అధ్యక్షుడిగా టి. రాజేందర్‌ సింగ్‌, జనరల్‌ సెక్రటరీగా జి.మహేందర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌గా బి.పూల్‌చంద్‌, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా ఐశ్వర్య, ట్రెజరీగా సంపత్‌, జాయింట్‌ సెక్రటరీగా ఎస్‌.కీర్తన జ్యోతి, స్పోర్ట్స్‌ సెక్రటరీగా ఎం. రామును ఎన్నుకున్నారు.

శ్రీవెంకటేశ్వర కళాపరిషత్‌ ఆవిర్భావం

జనగామ: జిల్లాలో రంగస్థల కళల అభివృద్ధి, కళాకారుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని శ్రీ వెంకటేశ్వర కళాపరిషత్‌ జనగామ పేరుతో సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేశారు. ఆదివారం పట్టణంలోని గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌లో నిర్వహించిన తొలి సర్వసభ్య సమావేశంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల రంగస్థల కళా కారులు, నాటక రంగ ప్రముఖులు పాల్గొని సంస్థ ఏర్పాటుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమావేశంలో శ్రీ వీరాంజనేయ నాట్యమండలి వ్యవస్థాపకుడు మేళ్లచెరువు వెంకట అప్పయ్య శాస్త్రి, కొండ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు కొండ శ్రీనివాస్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన సింధూరి కొండలరావు (సురభి), నంచర్ల వైకుంఠం, ఈరవెన్ను నాటకరంగ కళాకారులతో పాటు పట్టణా నికి చెందిన ఔత్సాహిక కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాత్కాలిక కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా మోతే సురేందర్‌రెడ్డి, అధ్యక్షుడిగా మేళ్లచెరువు వెంకట అప్పయ్యశాస్త్రి, ముఖ్య సలహాదారుగా నంచర్ల వైకుంఠం, ఉపాధ్యక్షులుగా మేకల రమణారెడ్డి, పన్నీరు రాజు, ప్రధాన కార్యదర్శిగా గంగు నాగరాజు శర్మ, సహాయ కార్యదర్శిగా ఆంజనేయ శర్మ, కోశాధికారిగా చల్లా రాజనరసింహారెడ్డి, ప్రచార కార్యదర్శిగా కొండ శ్రీనివాస్‌, సంగీత దర్శకులుగా కొండలరావును నియమించారు. సభ్యులుగా గంగు సాంబమూర్తి, సిద్ధులు, నర్సిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, రామమూర్తిని ఎన్నుకున్నారు.

భట్టు రమేశ్‌కు అభినందన

కేయూ క్యాంపస్‌: హైదరాబాద్‌లో తెలంగాణ తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్‌ భట్టు రమేశ్‌ను తెలుగు యూనివర్సిటీ మాజీ వీసీ హనుమాండ్ల భూమయ్య, వరంగల్‌ గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న, కేయూ దూరవిద్య ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కొట్టె భాస్కర్‌, పి.రవీందర్‌ సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement