ట్రేడ్‌ లైసెన్స్‌లు తప్పనిసరిగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ట్రేడ్‌ లైసెన్స్‌లు తప్పనిసరిగా తీసుకోవాలి

Jul 22 2026 1:23 AM | Updated on Jul 22 2026 1:23 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: మున్సిపాలిటీ పరిధిలో వాణిజ్య, వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు తమ సముదాయాలకు విధిగా ట్రేడ్‌ లైసెన్స్‌లు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ రాధాకృష్ణ తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది పట్టణ కేంద్రంలోని వైన్స్‌షాపులతో పాటు పలు వ్యాపార సముదాయాలను మంగళవారం తనిఖీ చేశారు. ట్రేడ్‌ లైసెన్స్‌లు తీసుకున్నారా? లేదా? అంటూ పరిశీలించారు. ఈ మేరకు కమిషనర్‌ మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఆదాయం కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నామన్నారు. వ్యాపారులు నిబంధనల మేరకు లైసెన్స్‌ ఫీజులు చెల్లించని పక్షంలో మున్సిపల్‌ చట్టం ప్రకారం చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో మేనేజర్‌ సత్యనారాయణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మధు, ఆర్‌ఐ శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement