స్టేషన్‌ఘన్‌పూర్: నియోజకవర్గంలో విద్యుత్ పరమైన అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. డివిజన్ పరిధిలోని విద్యుత్‌శాఖ అధికారులు స్టేషన్‌ఘన్‌పూర్ డీఈ బి.సారయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మంగళవారం హనుమకొండ ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. డివిజన్ పరిధిలో ఇటీవల జరిగిన పలు విద్యుత్ అభివృద్ది కార్యక్రమాలతో పాటు వినియోగదారులకు అందించాల్సిన పలు విద్యుత్ సౌకర్యాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేలా విద్యుత్ అధికారులతో పాటు సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏడీఈ రణధీర్‌రెడ్డి, జఫర్‌గఢ్ ఏఏఈ ఎం.కరుణాకర్ పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సంబంధిత పీజీ కోర్సుల్లో 55 శాతం మార్కులతో పాసై ఉండాలని (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం), నెట్,సెట్, పీహెచ్‌డీ ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 24వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 25వ తేదీ ఉద యం 11:00గంటలకు కళాశాలలో ఇంటర్వ్యూ ఉంటుందని, మరిన్ని వివరాలకు 99591 51051ఫోన్‌నంబర్‌లో సంప్రదించాలన్నారు. బీఎఫ్‌సీ,–1.కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్– 2, ఇంగ్లిష్–2, హెల్త్ కేర్–1 హిస్టరీ–1, పొలిటికల్ సైనన్స్ 1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్–1,తెలుగు–1 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
గ్రామాలాభివృద్ధే ధ్యేయం
బచ్చన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, గోపాల్‌నగర్‌లో, బచ్చన్నపేటలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతీ ఓటరు తమ వివరాలను ఎన్యుమరేషన్ ఫారంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. నూతనంగా ఎన్నికై న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్‌ను సన్మానించారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు అల్వాల నర్సింగారావు, ఇజ్జగిరి రాములు, బళ్ల రవీంద్రనాథ్, నాయకులు పిన్నింటి కావ్యశ్రీ, జంగిటి విద్యానాథ్ తదితరులు పాల్గొన్నారు.
రాహుల్‌గాంధీ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం
జనగామ: న్యూఢిల్లీలో విద్యార్థుల హక్కుల పరిరక్షణతో పాటు నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ జిల్లా కమిటీ అధ్యక్షురాలు ధన్వంతిలక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ.. దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బ తీసిన నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్య తగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధా న్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ఇతర నాయకుల అరెస్ట్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యార్థుల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం గౌరవించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.


