నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ తెరిచేవరకు ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ తెరిచేవరకు ఉద్యమం

Jul 21 2026 12:35 AM | Updated on Jul 21 2026 12:35 AM

మల్లాపూర్‌: నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తెరిచే వరకు బీజేపీ ఉద్యమిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు అన్నారు. చెక్కర ఫ్యాక్టరీ తెరిపించాలని బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం మల్లాపూర్‌ మండలం ముత్యంపేట శివారులోని నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ఎదుట ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మూతపడ్డ నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి కమిటీల అధ్యాయనం పేరుతో కాలయాపన చేస్తున్నాడని విమర్శించారు. 30 నెలలైన చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ గురించి పట్టించుకోవట్లేదని, బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పడుతుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు అనూప్‌రావు, రాష్ట్ర నాయకులు నరేందర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెపల్లి శ్రీనివాస్‌, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్ర లక్ష్మీ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఇట్టెడి రాజు(శేఖర్‌రెడ్డి), మండల అధ్యక్షుడు పందిరి నాగరాజు, నాయకులు కాంతయ్యచారి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ పటిష్టత కోసం కృషి చేయాలి

రాయికల్‌: రాయికల్‌లో బీజేపీ పటిష్టత కోసం కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు అన్నారు. సోమవారం రాయికల్‌లో బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న మచ్చ నారాయణను సన్మానించారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్‌ మోసపూరిత హామీలను వివరించాలన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు కుర్మ మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శులు కూనారపు భూమేశ్‌, సంజీవ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement