జగిత్యాల: పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. సోమవారం పెన్షనర్ల భవనంలో పెన్షనర్లకు హెల్త్‌కార్డులు అందజేశారు. ఈ కార్డులను పెన్షనర్లు ఉపయోగించుకోవాలని, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన వెయ్యి కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, కౌన్సిలర్లు శ్రీనివాస్, కూతురు శేఖర్, గట్టు సతీశ్ పాల్గొన్నారు.
తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు
తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. సోమవారం స్పెషల్ ఆఫీసర్, అదనపు కలెక్టర్ రాజాగౌడ్, కమిషనర్ సత్యప్రణవ్‌తో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎల్‌నినోను దృష్టిలో ఉంచుకుని పట్టణంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పట్టణంలో చట్టవిరుద్ధ నిర్మాణాల విషయంలో ముందస్తు నోటీసులు అందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి పాల్గొన్నారు.
వృద్ధుల సంరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత
వృద్ధుల సంరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను సీనియర్ సిటిజన్స్ కలిశారు. వృద్ధులను చివరి దశలో ఇబ్బందులు పెట్టకూడదని, వారిని ఆదరించాలని కోరారు. వారి కోసం సీఎం రేవంత్‌రెడ్డి కఠినమైన చట్టాలు సైతం తీసుకురావడం జరిగిందన్నారు. జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్, హన్మంతరెడ్డి, విజయ్ పాల్గొన్నారు.


