బాలశాస్త్రవేత్తలకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

బాలశాస్త్రవేత్తలకు ఆహ్వానం

Jul 21 2026 12:35 AM | Updated on Jul 21 2026 12:35 AM

5 ఉప అంశాలు..

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): నేటి బాలల ఆలోచనలే రేపటి ప్రపంచపు ఆవిష్కరణలు. ప్రతీచిన్నారిలోనూ ఒకశాస్త్రవేత్త ఉంటాడు. చుట్టూ జరిగే పరిణామాలను గమనిస్తూ, ఎదురయ్యే సమస్యలకు సమాధానాలు వెతకడమే సైన్స్‌ అసలైన పరమార్థం. ఈతరం విద్యార్థులకు కేవలం పుస్తక విజ్ఞానమే కాకుండా, ప్రయోగాత్మక పరిశోధనలపై మక్కువ పెంచేందుకు సరికొత్త వేదిక సిద్ధమైంది. తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో 32వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ – 2026కు సన్నహాలు ప్రారంభమయ్యాయి. చిన్నారి భవిష్యత్‌ శాస్త్రవేత్తల నుంచి రిజిస్ట్రేషన్‌లకు ఆహ్వానిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు, సంప్రదాయ విజ్ఞానం వంటి అద్భుతమైన అంశాలపై బాలలు తమ మేధస్సుకు పదును పెట్టి, సరికొత్త ప్రాజెక్టులతో ప్రపంచానికి దిశానిర్దేశం చేసేందుకు ఇదొక సువర్ణావకాశం.

శాసీ్త్రయ దృక్పథం వెలికి తీసేందుకు..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 10 నుంచి 17ఏళ్ల వయసుగల విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, పరిశోధనా నైపుణ్యాలను వెలికితీసేందుకు జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ వేదిక కానుంది. ఈఏడాది ‘సుస్థిరత కోసం సైన్స్‌, ఆవిష్కరణలు’ ప్రధాన ఇతివృత్తంతో పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ తేడా లేకుండా అన్నియాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొనవచ్చు. ఆసక్తి గలవిద్యార్థులు తమ గైడ్‌ టీచర్ల సాయంతో ఈనెల 31లోగా (( nc-r-c.i n) పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్‌ ఇలా..

జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ అధికారిక పోర్టల్‌లో వివరాలు నమోదు చేయడానికి విద్యార్థి పేరు, వయసు, ఈ మెయిల్‌ ఐడీ, ఫొటోగ్రాఫ్‌తోపాటు ప్రాజెక్ట్‌ శీర్షిక అవసరం. విద్యార్థులు ఒంటరిగా గానీ లేదా ఇద్దరు కలిసి ఒక టీమ్‌గా గానీ ప్రాజెక్టు సిద్ధం చేయవచ్చు. విద్యార్థులు తయారు చేసిన నివేదికను తెలుగు లేదా ఇంగ్లిష్‌ భాషలో సమర్పించవచ్చు. జిల్లాస్థాయిలో ఎంపికై న ఉత్తమ ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీలకు, అక్కడ ప్రతిభ చాటినవారు జాతీయస్థాయి పోటీలకు ఎంపికవుతారు. దేశంలోని అగ్రశ్రేణి శాస్త్రవేత్తలతో సంభాషించే అవకాశం ఈ వేదిక కల్పిస్తుండడం విశేషం.

32వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ – 2026కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం

రేపటి సుస్థిర సమాజ నిర్మాణం కోసం సరికొత్త ఆవిష్కరణల వేదిక

దరఖాస్తుల దాఖలుకు ఈనెల 31 వరకు గడువు

ప్రతీ పాఠశాల 5 ముఖ్యమైన ఉప అంశాల నుంచి కనీసం ఒక ప్రాజెక్ట్‌నైనా తప్పనిసరిగా సమర్పించాలి. అవే ఇవీ..

వ్యర్థాల నిర్వహణ కోసం ఆర్‌ – 5 సూత్రం : (రెడ్యూస్‌, రీయూస్‌, రీట్రైవ్‌, రీడీజైన్‌, రీసైకిల్‌)

ఇంధనం/శక్తి కోసం ఈ– 4 సూత్రం(ఎక్స్‌ఫ్లోర్‌, ఎక్స్‌పరిమెంట్‌, ఎన్‌హాన్స్‌, ఎవాల్వ్‌)

నీరు(హార్వెస్టింగ్‌, రీసైక్లింగ్‌, కన్‌సేర్వేషన్‌)

ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం

అప్లికేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్‌ ఫర్‌ సస్టేయినాబిలిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement