న్యూఢిల్లీ: భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత దాయాది పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దాదాపు ఫుల్‌స్టాప్ పడినట్లే కనిపిస్తోంది. మళ్లీ పాకిస్తాన్ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సిందూర్ అనేది ఆన్‌లోనే ఉందనే విషయాన్ని భారత్ పదే పదే నొక్కి చెప్పిన నేపథ్యంలో పాక్ కాస్త తగ్గినట్లే కనబడుతోంది.
అయితే ‘‘మాది అణ్వాయుధ దేశం. అవసరమైతే అణుయుద్ధం చేస్తాం’‘ అనే మాట పాకిస్తాన్ నుంచి అప్పుడప్పుడు నినిపిస్తూ ఉంటుంది. ఇప్పటివరకూ అణు యుద్ధానికి దిగకపోయినా గొప్పలు చెప్పకోవడంలో మాత్రం ముందుంటుంది పాకిస్తాన్.
ఇదిలా ఉంచితే, పాకిస్తాన్‌లోని న్యూక్లియర్ స్థావరాలను ఎప్పుడో తుంచేయాల్సి ఉందని, కానీ అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ నుంచి అనుమతి రాకపోవడం వల్లే అది ఆగిపోయిందన్నారు అమెరికా గూఢచార సంస్థ (Central Intelligence Agency) మాజీ అధికారి రిచర్డ్ బార్లో. ఈ విషయాన్ని తాజాగా ఏఎన్‌ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారాయన.
ఆనాడు ఇజ్రాయిల్‌తో కలిసి భారత్ సంయుక్త ఆపరేషన్‌కు సిద్ధమైంది. 1980 ఆరంభంలో భారత్-ఇజ్రాయిల్‌లు సంయుక్త ఆపరేషన్.. పాకిస్తాన్‌పైనే. పాక్‌లోని కతువాలోని న్యూక్లియర్ స్థావరాన్ని ధ్వంస చేయడమే ఆ ఆపరేషన్ లక్ష్యం. కానీ దానికి అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఒప్పుకోలేదు. అప్పటికే ఇజ్రాయిల్ సిద్ధంగా ఉంది. కానీ భారత్ అనుకూలంగా స్పందించలేదు.
ప్రధానంగా ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ నుంచి అనుమతి రాలేదు. దాంతో ఆ ఆపరేషన్ ఆగిపోయింది. లేకపోతే పాకిస్తాన్ న్యూక్లియర్ స్థావరాల ఎపిసోడ్ అనేది అప్పుడే ముగిసేది. ఇందిరా గాంధీ దానికి అనుమతి ఇవ్వకపోవడం నిజంగా సిగ్గు పడాల్సిన విషయం. పాకిస్తాన్ అణు స్థావరాలను మొగ్గలోనే తుంచేసే అవకాశం అప్పుడు వచ్చింది. కానీ దానికి ముందడుగు భారత్ నుంచి పడకపోవడం బాధాకరం’ అని ఆయన పేర్కొన్నారు.
అమెరికా ప్రభుత్వం.. పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని ఎలా కప్పిపుచ్చిందో బహిర్గతం చేశారు.పాకిస్తాన్ అణు ఆయుధాలు అభివృద్ధి చేస్తోందన్న స్పష్టమైన ఆధారాలు ఉన్నా, అమెరికా అధ్యక్షులు 1989 వరకు పాకిస్తాన్‌ను అణు ఆయుధాలు లేనిదిగా ధృవీకరించారని ఆయన ఆరోపించారు. అమెరికా కూడా తమ స్వలాభం కోసం ఇలా చేసిందన్నారు. F-16 యుద్ధ విమానాలను అణు ఆయుధాల రవాణాకు అనుకూలంగా పాక్ మార్చినట్లు ఆయన చెప్పారు. అయినా అమెరికా ప్రభుత్వం దానిని పట్టించుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా అప్పట్లో పాకిస్తాన్‌ను అణ్వాయుధ దేశంగా గుర్తించలేదని, దానికి చాలా కారణాలున్నాయన్నారు, ఒకవేళ అనాడే భారత్-ఇజ్రాయిల్‌లు సంయుక్తంగా ఆ ఆపరేషన్ చేపట్టి పాకిస్తాన్ రహస్య న్యూక్లియర్ స్థావరాలను ధ్వంసం చేసి ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం లభించి ఉండేదన్నారు.
ఇదీ చదవండి:


