సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది భారతీయులు దుర్మరణం | 9 indians died in Jeddah | Sakshi
Sakshi News home page

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది భారతీయులు దుర్మరణం.. కేంద్రం సంతాపం

Jan 29 2025 5:28 PM | Updated on Jan 29 2025 6:57 PM

9 indians died in Jeddah

రియాద్ : సౌదీ అరేబియాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు దుర్మణం పాలయ్యారు. ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రమాదంపై స్థానిక అధికారులతో మాట్లాడుతున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. 

 

ప్రమాదంపై జిజాన్‌లో భారత రాయభార కార్యాలయం మృతులకు సంతాపం తెలిపింది. ప్రమాద బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని, స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని తెలిపింది. 

ప్రమాదంపై విదేశాంగ మంత్రి జైశంకర్‌ విచారం వ్యక్తం చేశారు. జెడ్డాలోని రాయబార కార్యాలయంతో తాను మాట్లాడినట్లు తెలిపారు.  ప్రమాదం గురించి సమాచారం అడిగి తెలుసుకున్నామన్న జైశంకర్ ఈ విషాద పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement