మద్యం మత్తులో స్నేహితుణ్ని చంపేశారు | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో స్నేహితుణ్ని చంపేశారు

Jul 3 2023 10:06 AM | Updated on Jul 3 2023 10:05 AM

- - Sakshi

హైదరాబాద్: మద్యం మత్తులో స్నేహితుడిని చంపిన ఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ దశరథ్‌ చెప్పిన వివరాల ప్రకారం.. బోరబండకు చెందిన మహ్మద్‌ అకీల్‌ (25) ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు.

బక్రీద్‌ సందర్భంగా అకీల్‌ న్యూ హాఫీజ్‌పేట్‌ ప్రేమ్‌నగర్‌కు వచ్చి తన పాత స్నేహితులు షేక్‌ ఆసీఫ్‌ (22), మహ్మద్‌ అబ్బాస్‌ (23), సమీర్‌ఖాన్‌(22), షేక్‌ అమీద్‌ (25), అస్లాంఖాన్‌ (20), మహ్మద్‌ ఫరునుద్దీన్‌ (22)లతో కలిసి శనివారం రాత్రి మద్యం తాగారు. ఈ క్రమంలో గొడవ జరిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. కోపోద్రిక్తులైన ఆరుగురు స్నేహితులు కలిసి అకీల్‌ కడుపులో చాకుతో పొడిచి, సుత్తె, బండరాయితో తలపై మోది హత్య చేసి పరారయ్యారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement