ఎంబీబీఎస్‌ విద్యార్థి ఆత్మహత్య | Osmania Medical College: First-year MBBS student dies by suicide in Hyderabad | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్‌ విద్యార్థి ఆత్మహత్య

Aug 17 2026 1:57 AM | Updated on Aug 17 2026 1:57 AM

Osmania Medical College: First-year MBBS student dies by suicide in Hyderabad

పరీక్షల ఒత్తిడే కారణమా..?

ఉప్పల్‌ (హైదరాబాద్‌): ఎంబీబీఎస్‌ విద్యార్థి ఉప్పల్‌లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నా డు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం చట్ల తిమ్మాయిపల్లికి చెందిన కోల్కూరి భరద్వాజ్‌ (18) ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతు న్నాడు. రామంతాపూర్‌ పీఎస్‌ కాలనీలోని బంధువుల ఇంట్లో ఉంటున్నారు. భరద్వాజ్‌ సోద రి వారేణ్య కూడా ఎంబీబీఎస్‌ చదువుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు ఇద్దరు కలిసి చదు వుకున్నారు. 

సోదరి ఆదివారం తెల్లవారు జా మున 3.30 గంటల సమయంలో చూసే సరికి భరద్వాజ్‌ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువులను సంప్రది స్తూ వివిధ ప్రాంతాల్లో గాలించినా ఆచూ కీ ల భించలేదు. ఉదయం 7.25 గంటలకు వారేణ్య ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. ఉదయం 8.30 గంటల సమయంలో గుర్తు తెలియని యువకు డు ఎన్‌ఎస్‌ఎల్‌ భవనంపై నుంచి పడి ఉన్నా డన్న సమాచారం డయల్‌ 100కు అందడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకు న్నా రు. 

ఇదే సమాచారాన్ని భరద్వాజ్‌ కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు వచ్చి చనిపో యినది భరద్వా జ్‌ అని ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సోమవారం నుంచి పరీక్షలు ఉండటంతో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నా డన్న కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement