హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎయిర్‌పోర్టు నుంచి కడపకు బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు హల్‌చల్ చేశాడు. ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో తోటి ప్రయాణికులలో భయానక పరిస్థితి ఏర్పడింది. ఇది గమనించిన విమాన సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రయాణీకులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు.
అలాగే, ఈ సమాచారాన్ని విమాన సిబ్బంది పోలసులకు చేరవేయగా, పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, అతడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ఎందుకు ప్రయత్నించాడనే విషయం, అలాగే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: గచ్చిబౌలిలో విదేశీ యువతులతో వ్యభిచారం


