గచ్చిబౌలిలో విదేశీ యువతులతో వ్యభిచారం | prostitution foreign women gachibowli | Sakshi
Sakshi News home page

గచ్చిబౌలిలో విదేశీ యువతులతో వ్యభిచారం

Oct 2 2026 9:10 AM | Updated on Oct 2 2026 10:06 AM

prostitution foreign women gachibowli

హైదరాబాద్‌:  పోలీసులు అంతర్జాతీయ సెక్స్‌ రాకెట్‌ గుట్టురట్టు చేసి ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఢిల్లీ కేంద్రంగా ఆన్‌లైన్‌లో విదేశీ సెక్స్‌ వర్కర్లను బుక్‌ చేసి గచ్చిబౌలి లోని ఓ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్‌ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌కు సమాచారం అందింది. బుధవారం గచ్చిబౌలి పోలీసులతో కలిసి ఏపీహెచ్‌బీ కాలనీలోని హోటల్‌పై దాడి చేశారు. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఒక యువతి, తుర్క్‌మెనిస్తాన్‌కు చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకొని రెస్క్యూ హోమ్‌కు తరలించారు.

 సబ్‌ ఆర్గనైజర్‌ మారం మోహన్‌ రెడ్డి, విటుడు హర్షిత్‌ సంఘానియాలను అరెస్ట్‌ చేశారు. ఢిల్లీకి చెందిన నిఖిల్‌ అలియాస్‌ సన్నీ ఆన్‌లైన్‌లో విటులను బుక్‌ చేసి  గచ్చిబౌలిలోని ఓ హోటల్‌కు పంపుతాడు. పట్టుబడ్డ ముగ్గురు యువతులు ఆగస్టు 30న భారత్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. 15 రోజులుగా ముగ్గురు యువతులు ఆ హోటల్‌లో ఉంటున్నారని పోలీసులు తెలిపారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement