breaking news
osmania medical college students
-
ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య
ఉప్పల్ (హైదరాబాద్): ఎంబీబీఎస్ విద్యార్థి ఉప్పల్లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నా డు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం చట్ల తిమ్మాయిపల్లికి చెందిన కోల్కూరి భరద్వాజ్ (18) ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతు న్నాడు. రామంతాపూర్ పీఎస్ కాలనీలోని బంధువుల ఇంట్లో ఉంటున్నారు. భరద్వాజ్ సోద రి వారేణ్య కూడా ఎంబీబీఎస్ చదువుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు ఇద్దరు కలిసి చదు వుకున్నారు. సోదరి ఆదివారం తెల్లవారు జా మున 3.30 గంటల సమయంలో చూసే సరికి భరద్వాజ్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువులను సంప్రది స్తూ వివిధ ప్రాంతాల్లో గాలించినా ఆచూ కీ ల భించలేదు. ఉదయం 7.25 గంటలకు వారేణ్య ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఉదయం 8.30 గంటల సమయంలో గుర్తు తెలియని యువకు డు ఎన్ఎస్ఎల్ భవనంపై నుంచి పడి ఉన్నా డన్న సమాచారం డయల్ 100కు అందడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకు న్నా రు. ఇదే సమాచారాన్ని భరద్వాజ్ కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు వచ్చి చనిపో యినది భరద్వా జ్ అని ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సోమవారం నుంచి పరీక్షలు ఉండటంతో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నా డన్న కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ దర్యాప్తు ప్రారంభించారు. -
ఉస్మానియా మెడికల్ కాలేజీలో తీవ్ర విషాదం వైద్య విద్యార్థి ఆత్మహత్య
-
హైదరాబాద్ : ఘనంగా ఉస్మానియా మెడికల్ కళాశాల స్నాతకోత్సవం (ఫొటోలు)
-
రోడ్డు ప్రమాదంలో నలుగురు మెడికోల దుర్మరణం
- మృతులంతా ఉస్మానియా మెడికల్ కళాశాల విద్యార్థులు - విజయవాడ సమీపంలో దుర్ఘటన.. చెట్టును ఢీకొన్న ప్రైవేటు బస్సు విజయవాడ(భవానీపురం), ఇబ్రహీంపట్నం: విజయవాడ సమీపంలోని గొల్లపూడి వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందారు. మరో 17 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థులు, స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన 48 మంది విద్యార్థులు నాలుగు రోజుల కిందట స్పోర్ట్స్ మీట్లో భాగంగా అమలాపురం వెళ్లారు. సోమవారం తిరిగి అమలాపురం నుంచి ధనుంజయ ట్రావెల్స్ బస్సు(ఏపీ 28 టీబీ 1166)లో హైదరాబాద్కు బయలుదేరారు. మార్గమధ్యలో గొల్లపూడి సమీపంలోని సూరయ్యపాలేనికి వచ్చేసరికి మలుపు వద్ద బస్సు అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. అదే వేగంతో పక్కనున్న భారీ వృక్షాన్ని ఢీకొంది. దీంతో బస్సులో ఉన్న విద్యార్థులందరూ ఒకరిపై ఒకరు పడిపోయారు. కొందరు విద్యార్థులు సీట్ల కింద ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు మృతిచెందారు. డ్రైవర్, ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు సీట్ల కింద చిక్కుకుపోయాయి. మరో విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతిచెందిన వారిలో డ్రైవర్ కూడా ఉన్నాడు. గాయపడిన 17 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ మద్యం తాగి వాహనం నడపడంతోనే ఈ ఘటన జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను గొల్లపూడిలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు: మచ్చా ప్రణయ్ (సరూర్ నగర్), విజయ్ తేజ (కుత్బుల్లాపుర్), ఉదయ్ (కరీంనగర్), గిరి లక్ష్మణ్ (ఆదిలాబాద్), డ్రైవర్ వేముల శివయ్య విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం మంగళగిరి సమీపంలోని హాయ్లాండ్కు వెళ్లి అక్కడే భోజనాలు చేశారని సమాచారం. బస్సు డ్రైవర్ ను వేముల వెంకట శివయ్య గా గుర్తించారు. ఈ ప్రమాద ఘటనా స్థలికి ప్రిన్సిపాల్ ప్రభాకర్, డీఎంఈ రమణి చేరుకున్నారు. విద్యార్థులను ఘటనా వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివరాల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు సంప్రదించాల్సిన నెంబర్లు: 86868 64656, 94407 52310, 040 24653992


