Mahesh Babu's 'Guntur Kaaram' New Poster - Do You Know Shirt Price - Sakshi
Sakshi News home page

Mahesh Babu Guntur Kaaram: 'గుంటూరు కారం' పోస్టర్‌.. మహేశ్‌ వేసుకున్న షర్ట్‌ ధరెంతో తెలుసా?

Aug 10 2023 3:22 PM | Updated on Aug 10 2023 3:54 PM

Do You Know Mahesh Babu Guntur Kaaram New Poster Shirt Price - Sakshi

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా గుంటూరు కారం. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ ఇది. ఇందులో శ్రీలీల,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా మహేశ్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

క్రేజీ లుక్‌లో మహేశ్‌ బాబు

అందులో మహేశ్‌ మాస్‌ లుక్‌లో దర్శనమిచ్చారు. లుంగీ, షర్ట్‌ ధరించి కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుని బీడీ కాలుస్తూ క్రేజీ లుక్‌లో కనిపించారు. ఈ పోస్టర్‌ రిలీజ్‌ అయిన కాసేపటికే నెట్టింట వైరల్‌గా మారింది. ఇక పోస్టర్‌లో మహేశ్‌ బాబు వేసుకున్న షర్ట్‌ ఫ్యాన్స్‌ను బాగా అట్రాక్ట్‌ చేసింది. ఇది ఏ బ్రాండ్‌? దీని ధరెంత అ​ంటూ నెట్టింట సెర్చ్‌ చేశారు. సాధారణంగానే సెలబ్రిటీలు వాడిన కాస్ట్యూమ్స్‌, వాచెస్‌, షూస్‌ వంటి వస్తువులను ట్రై చేయాలని అభిమానులు ఆరాటపడుతుంటారు.

మహేశ్‌ రేంజ్‌కి ఆ మాత్రం ఉండాలిగా..

ఈ క్రమంలో మహేశ్‌ వేసుకున్న క్యాజువల్‌ షర్ట్‌ గురించి గూగుల్‌ చేయగా వారికి దిమ్మతిరిగే బొమ్మ కనిపించింది. ఎందుకంటే గుంటూరు కారం లేటెస్ట్‌ పోస్టర్‌లో మహేశ్‌ వేసుకున్న షర్ట్‌ ధర అక్షరాల రూ.74,509. ఫ్యాషన్ ఫార్‌ఫెచ్ R13కు చెందిన బ్లీచ్ వాష్ ప్లాయిడ్ లాంగ్ స్లీవ్ షర్ట్‌లో  మహేశ్‌ మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. అయితే ఇంత సింపుల్‌ షర్ట్‌ అంత కాస్ట్‌లీనా అని కొందరు షాక్‌ అవుతుంటే, మహేశ్‌ రేంజ్‌కి ఆ మాత్రం ఉండాలిగా అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement