విశాఖ: చైనా వెళ్తున్నానని చెప్పి లాడ్జిలో.. | Kerala Medico Student Committed Suicide Due To Love Affair In Visakhapatnam - Sakshi
Sakshi News home page

విశాఖ: చైనా వెళ్తున్నానని చెప్పి లాడ్జిలో.. వాట్సాప్‌ ఛాట్‌తో వీడిన మెడికో మృతి కేసు మిస్టరీ

Aug 26 2023 4:17 PM | Updated on Aug 26 2023 5:32 PM

Medico Committed Suicide Due To Love Affair In Visakhapatnam - Sakshi

నగరంలో మెడికో రమేష్‌ కృష్ణ ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడితో ఏర్పడిన మనస్పర్ధలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు తేల్చారు.

సాక్షి, విశాఖపట్నం: నగరంలో మెడికో రమేష్‌ కృష్ణ ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడితో ఏర్పడిన మనస్పర్ధలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు తేల్చారు.

ఈ నెల 23వ తేదీన విశాఖకు వచ్చిన యువతి రమేష్ కృష్ణ.. అంతకు ముందే ఇండోర్‌లో ఉన్న ప్రియుడిని కలిసింది. చైనాలో ఎంబీబీఎస్‌ ఫోర్త్ ఇయర్ చదువుతున్న మెడికో.. స్వస్థలం కేరళ, త్రిశూర్ జిల్లా, వందనపల్లి మండలం. చైనా వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరిన రమేష్ కృష్ణ... విశాఖ నుంచి సింగపూర్‌కు కనెక్టింగ్ ఫ్లైట్‌కి వెళ్లడానికి దాబా గార్డెన్‌లోని ఓ లాడ్జిలో దిగింది.

ఈ నెల 24న చెక్ అవుట్ చేయాల్సి ఉండగా, ఆమె గది నుంచి బయటకు రాలేదు.. లోపల నుంచి గడియాపెట్టి ఉండటంతో లాడ్జి నిర్వహకులకు అనుమానం వచ్చి.. పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు తలుపును బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించగా, ఆ యువతి గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతున్నట్టు కనిపించింది. ‘‘తన చావుకు ఎవరూ కారణం కాదనీ.. సారీ అమ్మ’’ అంటూ ఆ సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
చదవండి: భర్త వేధింపులపై ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement