‘వ్యవస్థల్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు’ | YSRCP Leader Narayana Swamy Slams Chandrababu | Sakshi
Sakshi News home page

‘వ్యవస్థల్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు’

Aug 16 2026 10:05 PM | Updated on Aug 16 2026 10:05 PM

YSRCP Leader Narayana Swamy Slams Chandrababu

తిరుపతి:  సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్‌ చేశారు. మహిళలంటే గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడని, వ్యవస్థల్ని నాశనం చేసిన వ్యక్తి అని ధ్వజమెత్తారు. 

పేదలకు సేవలు చేసిన వారికి ఏ ఒక్కరికి చంద్రబాబు ‘ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు, డబ్బులున్న వారికే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు , ఈరోజు ఆయన సత్యహరిశ్చంద్రుడు మాదిరిగా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసినందుకు టీచర్లకు, రెవెన్యూ అధికారులకు, పోలీసులకు చంద్రబాబు తగిన గుణపాఠం నేర్పుతున్నారు. ముగ్గురు టీచర్లను సస్పెండ్ వేటు వేశారు. 

పోలీసులను అడ్డం పెట్టుకుని ఈరోజు పాలన సాగిస్తున్నారు. ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు నాయుడు తప్పుడు కేసులు పెడుతున్నారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని రాష్ట్రంలో ఈరోజు పెద్ద ఎత్తున యువత పోరాటబాట పట్టింది.  రాబోయే రోజుల్లో మహిళలే చంద్రబాబుకు చరమగీతం పాడతారు’ అని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement