Representative image
అనకాపల్లి: పాయకరావుపేట మండలం వెంకట నగరం సముద్ర తీరంలో బోటు బోల్తా పడి ఉప్పాడ బాబ్జి అనే మత్స్యకారుడు మృతిచెందాడు. ఒడ్డుకు వస్తున్న మత్స్యకారుల బోటును భారీ కెరటాలు చుట్టుముట్టాయి. కెరటాల ఉద్ధృతికి ఒక్కసారిగా మత్స్యకారుల బోటు బోల్తాపడింది.
ప్రమాద సమయంలో బోటులో నలుగురు మత్స్యకారులు ఉన్నారు. ఉప్పాడ బాబ్జి బోటు కింద చిక్కుకుపోయాడు. బోటు కింద పడటంతో బాబ్జికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాబ్జి మృతితో అతడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


