సాక్షి మనీ మంత్ర: లాభాల్లోకి స్టాక్‌మార్కెట్లు | Today Stock Market Opening [March 27, 2024] | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: లాభాల్లోకి స్టాక్‌మార్కెట్లు

Mar 27 2024 9:36 AM | Updated on Mar 27 2024 10:15 AM

stock market today opening - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. క్రితం నష్టాలతో ముగిసిన బెంచ్‌ మార్క్‌ సూచీలు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెషన్‌ ప్రారంభ సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌  182.35 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 72,652.65 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 57.40 పాయింట్లు లేదా 0.26 శాతం లాభంతో 22,062.10 వద్ద కొనసాగుతున్నాయి.

బీపీసీల్‌, రిలయన్స్‌, అదానీ పోర్ట్స్‌, మారుతీ సుజుకీ, హెచ్‌యూఎల్‌ షేర్లు మంచి లాభాలతో టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐషర్‌ మోటర్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, విప్రో, కోటక్‌ మహీంద్ర షేర్లు టాప్‌ లూజర్స్‌ జాబితాలో ఉన్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement