పసిడి ధరల పతనం.. ఒకే రోజులో భారీ తగ్గుదల! | Gold Prices Fall Suddenly in Hyderabad Delhi and Chennai | Sakshi
Sakshi News home page

పసిడి ధరల పతనం.. ఒకే రోజులో భారీ తగ్గుదల!

Jun 18 2026 7:51 PM | Updated on Jun 18 2026 8:35 PM

Gold Prices Fall Suddenly in Hyderabad Delhi and Chennai

గురువారం ఉదయం స్థిరంగా ఉన్న బంగారం ధరలు, సాయంత్రానికి భారీ తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో గోల్డ్ రేటు ఒక్కసారిగా పతనమైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,38,500 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం ధర, సాయంత్రానికి 1450 రూపాయలు తగ్గి, రూ.1,37,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.1,51,100 నుంచి 1590 రూపాయలు తగ్గి రూ.1,49,510 వద్దకు చేరింది.

ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల రేటు 1,38,650 రూపాయల నుంచి 1,37,200 రూపాయల (రూ.1,450 తగ్గింది) వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు 1,51,250 రూపాయల నుంచి 1,49,660 రూపాయల (రూ.1590 తగ్గింది) వద్దకు చేరింది.

చెన్నైలో ఈ రోజు (జూన్ 18) స్వల్పంగా తగ్గిన బంగారం రేటు, సాయంత్రానికి మరింత తగ్గింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,40,600 వద్ద నుంచి రూ.1,39,500 వద్దకు (రూ.1100 తగ్గింది) చేరింది. 24 క్యారెట్ల రేటు 1,53,380 రూపాయల నుంచి 1,52,180 రూపాయలకు (రూ.1200 తగ్గింది) చేరింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement