మార్కెట్‌కు ఆర్థికమంత్రి ఆసరా | The domestic stock market rebounded strongly following Nirmala Sitharamans remarks | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు ఆర్థికమంత్రి ఆసరా

Oct 14 2026 4:05 AM | Updated on Oct 14 2026 4:05 AM

The domestic stock market rebounded strongly following Nirmala Sitharamans remarks

‘ఎల్‌టీసీజీ’, ‘ఎస్‌టీటీ’లపై సీతారామన్‌ సానుకూల వ్యాఖ్యలు 

అదరగొట్టిన ఐటీ, ఫైనాన్స్‌ షేర్లు 

సెన్సెక్స్‌ 1,109 పాయింట్లు ప్లస్‌ 

359 పాయింట్లు బలపడిన నిఫ్టీ 

రూ. 5 లక్షల కోట్ల సంపద సృష్టి

ముంబై: ధీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టీసీజీ)పన్ను, సెక్యూరిటీల లావాదేవీ పన్ను (ఎస్‌టీటీ)లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన సానుకూల వ్యాఖ్యలతో మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ బలంగా పుంజుకుంది. ఫలితంగా ఐటీ, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ షేర్ల ర్యాలీ కారణంగా సెన్సెక్స్‌ 1,109 పాయింట్లు పెరిగి 73,033 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 359 పాయింట్లు బలపడి 22,722 వద్ద నిలిచింది. 

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ రికవరీకి కూడా కలిసొచ్చింది. క్రూడాయిల్‌ ధరలు స్వల్పంగా చల్లారటం, గరిష్ట స్థాయిల నుంచి బాండ్లపై రాబడులు దిగిరావడం సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. మార్కెట్‌  ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు పెరిగింది. దీంతో బీఎస్‌ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్‌ విలువ రూ.470 లక్షల కోట్లకు చేరింది.  

» బీఎస్‌ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ఐటీ 5.5%, రియల్టీ 2.5%, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ 1.5%, పీఎస్‌యూ బ్యాంక్‌ 1.3%, ఆటో 1.2%, ఎఫ్‌ఎంసీజీ 1.2% ర్యాలీ చేశాయి. 

ఐటీ ‘టెక్‌’ మెరుపులు..
అంతర్జాతీయ మార్కెట్లలో ఏఐ కంపెనీల షేర్లు వరుసగా పతనమవుతుండటంతో, గ్లోబల్‌ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్థిరమైన సంప్రదాయ ఐటీ సేవలందించే భారతీయ కంపెనీల వైపు (యాంటీ–ఏఐ ట్రేడ్‌) మళ్లించడం కలిసొచ్చింది. హెచ్‌సీఎల్‌ టెక్‌ 8.3%, కేపీఐటీ టెక్నాలజీస్‌ 6.8%, టీసీఎస్‌ 6.6%, న్యూజెన్‌ సాఫ్ట్‌వేర్‌ 6.2%, జెన్సార్‌ టెక్నాలజీస్‌ 6% మేర ర్యాలీ చేశాయి. వీటితో పాటు టాటా ఎలక్సీ 5.3%, ఎమ్‌ఫసిస్‌ 5.2%, టెక్‌ మహీంద్రా 4.9%, విప్రో 4.5%, కోఫోర్జ్‌ 4.4%, ఇన్ఫోసిస్‌ 4.4%, ఎల్‌టీఐమైండ్‌ట్రీ 4.2% చొప్పున లాభపడ్డాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement