దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 989.33 పాయింట్లు లేదా 1.17 శాతం తగ్గి 83,339.26 వద్ద, నిఫ్టీ50 277.30 పాయింట్లు లేదా 1.07 శాతం తగ్గి 25,607.20 వద్ద ముగిసింది. పశ్చిమాసియాలో పెరిగిన దాడుల కారణంగా చమురు ధరలు ఎగిసిన ప్రభావంతో భారత బెంచ్ మార్క్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలను చవి చూశాయి. మరోవైపు అమెరికా-భారత వాణిజ్య ఒప్పందం ముగింపుపై అనిశ్చితి కూడా ప్రభావం చూపింది.
శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నిఫ్టీ50లో టాప్ నష్టాలు ఎదుర్కొన్నాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వరుసగా 0.10 శాతం, 0.56 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ తీవ్రంగా నిరాశపరిచాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ కెమికల్ బలంగా నిలిచాయి.


