ఐటీ షేర్ల జోరు.. స్టాక్‌ మార్కెట్‌ ముగిసిందిలా.. | Stock Market Gains Sensex ends 390 pts up realty IT shine Nov 26 | Sakshi
Sakshi News home page

ఐటీ షేర్ల జోరు.. స్టాక్‌ మార్కెట్‌ ముగిసిందిలా..

Nov 26 2026 4:16 PM | Updated on Nov 26 2026 4:16 PM

Stock Market Gains Sensex ends 390 pts up realty IT shine Nov 26

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. అమెరికా, భారత వాణిజ్య ఒప్పందాలపై స్పష్టత కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్న క్రమంలో అస్థిరంగా సాగిన సెషన్‌ను బెంచ్ మార్క్ సూచీలు లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 390.31 పాయింట్లు లేదా 0.46 శాతం పెరిగి 84,328.59 వద్ద, నిఫ్టీ50 65.25 పాయింట్లు లేదా 0.25 శాతం పెరిగి 25,884.50 వద్ద స్థిరపడింది.

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, బీఎస్‌ఈ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నిఫ్టీ50లో టాప్ లాభాలు పొందాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వరుసగా 0.32 శాతం, 0.74 శాతం పెరిగాయి. రంగాలవారీగా నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ మెటల్ మెరుగైన ప్రదర్శన ఇచ్చాయి, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, నిఫ్టీ ఆటో, నిఫ్టీ మీడియా బలహీన ప్రదర్శన కనబరిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement