10 కోట్లు దాటిన MSME రిజిస్ట్రేషన్స్ | MSME Registrations Cross 10 Crore in India | Sakshi
Sakshi News home page

10 కోట్లు దాటిన MSME రిజిస్ట్రేషన్స్

Nov 26 2026 12:24 PM | Updated on Nov 26 2026 12:24 PM

MSME Registrations Cross 10 Crore in India

ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్, ఉద్యమ్‌ అసిస్ట్‌ ప్లాట్‌ఫామ్‌లలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రిజిస్ట్రేషన్ల సంఖ్య 10 కోట్ల మైలురాయిని దాటింది. ‘ఈ రంగం క్రమంగా వ్యవస్థీకృతం అవుతోందనేందుకు ఇది నిదర్శనం’ అని ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘనత 2026 అక్టోబర్‌ 30న సాధించినట్లు తెలిపింది.

ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లో నమోదైన సంస్థల్లో మహిళల ఆధ్వర్యంలోని ఎంఎస్‌ఎంఈలు 3.76 కోట్లు ఉన్నాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 37.8 శాతంగా ఉంది. ‘‘పది కోట్ల రిజిస్ట్రేషన్ల మైలురాయి కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. లక్షలాది సంస్థలు అధికారిక గుర్తింపు పొందేందుకు, దేశ వృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నాయనేందుకు ఇదొక సంకేతం’’ అని మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. అసంఘటిత రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సూక్ష్మ, చిన్న సంస్థలు రిజిస్ట్రేషన్‌ సదుపాయాలు పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు 2023 జనవరి 11న ఉద్యమ్‌ అసిస్ట్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement