మార్కెట్‌ ఇన్వెస్టర్లకు కేవైసీ రూల్స్‌ మార్చిన సెబీ | SEBI Simplifies KYC Rules Investors No More Repeated Document Submission | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ ఇన్వెస్టర్లకు కేవైసీ రూల్స్‌ మార్చిన సెబీ

Nov 26 2026 2:30 PM | Updated on Nov 26 2026 2:35 PM

SEBI Simplifies KYC Rules Investors No More Repeated Document Submission

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నో యువర్‌ కస్టమర్‌(కేవైసీ) మార్గదర్శకాలలో సవరణలు చేపట్టింది. తద్వారా ఇన్వెస్టర్ల కేవైసీ నిబంధనలను సరళతరం చేసింది. దీంతో వివిధ మార్కెట్‌ ఇంటర్మీడియరీల మధ్య క్లయింట్ల డాక్యుమెంటేషన్‌ డూప్లికేషన్‌ను నివారించేందుకు వీలు చిక్కనుంది. ఇంటర్మీడియరీల మధ్య క్లయింట్ల సమాచారాన్ని పంచుకునేందుకు అవకాశం ఏర్పడటంతో కేవైసీకి సంబంధించి సప్లిమెంటరీ సమాచారాన్ని పొందుపరచవలసిన అవసరం తప్పనుంది.

కేవైసీ కేంద్రీకృత రిజిస్ట్రేషన్‌ అధీకృత సంస్థ(కేఆర్‌ఏ) స్థాయిలో అనుమతిస్తూ ఇందుకు నిబంధనలు సడలించింది. వెరసి వివిధ ఇంటరీ్మడియరీల వద్ద క్లయింట్లు తమకు సంబంధించిన ఒకే సమాచారాన్ని పదేపదే దాఖలు చేయవలసిన అవసరం ఉండదు. ఖాతా ప్రారంభించేందుకు నింపే ఫామ్‌(ఏవోఎఫ్‌) రెండో భాగం(పార్ట్‌–2)లో నింపే సప్లిమెంటరీ సమాచారాన్ని కేఆర్‌ఏ ద్వారా కేందీక్రృతం చేయనున్నారు. దీంతో వివిధ ఇంటరీ్మడియరీల వద్ద కస్టమర్లు పలుమార్లు పార్ట్‌–2 సమాచారాన్ని అందించవలసిన అవసరం తప్పుతుంది.

అయితే ఇంటర్మీడియరీలు సైతం క్లయింట్ల అదనపు సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయవలసి ఉంటుంది. సెంట్రల్‌ కేవైసీ ఐడీ, డిజిటల్‌ పోస్టల్‌ ఇండెక్స్‌ సంఖ్య(డిజిపిన్‌), అధీకృత డాక్యుమెంట్ల(ఓవీడీ) కాలపరిమితి తదితర వివరాలను కేఆర్‌ఏ వ్యవస్థకు అందించవలసి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement