25 రోజుల్లో రూ.34.61 లక్షల కోట్లు సంపద సృష్టి! | Indian Stock Market Creates 34 61 Lakh Cr Wealth in Just 25 Days | Sakshi
Sakshi News home page

25 రోజుల్లో రూ.34.61 లక్షల కోట్లు సంపద సృష్టి!

Nov 25 2026 8:18 AM | Updated on Nov 25 2026 8:18 AM

Indian Stock Market Creates 34 61 Lakh Cr Wealth in Just 25 Days

ఈ నెలలో 7,976 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌  

సరికొత్త రికార్డుకి 3,723 పాయింట్ల దూరంలో..

రూ.1.27 లక్షల కోట్ల ఎఫ్‌ఐఐ పెట్టుబడులు

గ్లోబల్‌ మార్కెట్లు కుదేలైనా భారత్‌ దూకుడు 

దేశీయ ఈక్విటీ మార్కెట్లు ప్రస్తుత నెలలో భారీ ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్ల రికార్డు స్థాయి కొనుగోళ్లు, దిగొచ్చిన క్రూడాయిల్‌ ధరలు, ప్రోత్సాహకర కార్పొరేట్‌ క్యూ2 ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయంగా ఏఐ ఆధారిత షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడం మన మార్కెట్లకు కలిసొచ్చాయి. ఫలితంగా నవంబర్‌ 23 నాటికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 7,976 పాయింట్లు (10.71%) దూసుకెళ్లింది. మార్కెట్లలో నెలకొన్న బుల్లిష్‌ ట్రెండ్‌కు అనుగుణంగా బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (ఇన్వెస్టర్ల సంపద) రూ.34.61 లక్షల కోట్లు పెరిగి రూ.508.98 లక్షల కోట్లకు (5.48 ట్రిలియన్‌ డాలర్లు) చేరుకుంది. 

విదేశీ పెట్టుబడుల నిధుల ప్రవాహం 

స్టాక్‌ మార్కెట్‌ అనూహ్య ర్యాలీలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) ప్రధాన పాత్ర పోషించారు. ఎన్‌ఎస్‌డీఎల్‌ డేటా ప్రకారం నవంబర్‌ 23 నాటికి ఎఫ్‌ఐఐల నికర పెట్టుబడులు రూ.1.27 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. భారత మార్కెట్‌ చరిత్రలోనే ఇది అత్యధిక నెలవారీ విదేశీ పెట్టుబడుల రికార్డు కావడం విశేషం. గతంలో 2020 నవంబర్‌లో నమోదైన రూ.60,358 కోట్ల రికార్డును ఇది రెట్టింపు స్థాయిలో అధిగమించింది. కాగా, సెపె్టంబర్‌లో రూ.35,861 కోట్లు, అక్టోబర్‌లో రూ.34,843 కోట్ల పెట్టుబడులను ఎఫ్‌ఐఐలు ఉపసంహరించుకున్న తర్వాత, మళ్లీ ఈ స్థాయిలో కొనుగోళ్లకు దిగడం విశేషం.  

ప్రపంచ మార్కెట్లలో ‘భారత్‌’ భేష్‌..! 

కృత్రిమ మేధ (ఏఐ) రంగ షేర్లలో వెల్లువెత్తిన విక్రయాల కారణంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టాలు చవిచూస్తున్నాయి. అందుకు భిన్నంగా భారతీయ ఈక్విటీ మార్కెట్లు అత్యుత్తమ పనితీరు ప్రదర్శిస్తున్నాయి. ‘‘భారత్‌ పట్ల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) వైఖరిలో అనూహ్య మార్పు వచి్చంది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలంగా పుంజుకుంది. కార్పొరేట్‌ లాభాల వృద్ధి  అంచనాలకు మించి నమోదైన ఆకట్టుకున్నాయి. ఈ అంశాలకు తోడు బలమైన ఫండమెంటల్స్‌ మద్దతు లభించింది. ఫలితంగా ఈ నవంబర్‌లో ఇప్పట్టకి వరకు ప్రపంచంలోని అగ్రస్థాయి మార్కెట్లలో భారత్‌ అత్యుత్తమ పనితీరు కనబరిచింది’’ అని జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయకుమార్‌ తెలిపారు. అంతర్జాతీయంగా బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 88.90 డాలర్లకు దిగిరావడమూ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మరింత బలపరిచింది. 

జీవితకాల గరిష్టానికి 3,723 పాయింట్ల దూరం  

ఈ ఏడాది అక్టోబర్‌ 1న సెన్సెక్స్‌ 71,293 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకిన తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. గతేడాది డిసెంబర్‌ 1న నమోదు చేసిన 86,159 జీవితకాల గరిష్ట స్థాయికి సెన్సెక్స్‌ కేవలం 3,723 పాయింట్ల దూరంలో ఉంది. కాగా, వరుస నాలుగు వారాల ర్యాలీ నేపథ్యంలో లాభాల స్వీకరణ కారణంగా సోమవారం స్టాక్‌ మార్కెట్‌ దాదాపు రెండు శాతం నష్టపోయింది.

ఇదీ చదవండి: సారొచ్చారు.. బంగారాన్ని పెంచారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement