ఏనుగులు నాట్యం చేస్తుంటే.. పక్కకు తప్పుకోవాల్సిందే! | Uday Kotak on Nvidia CEO Jensen Huang Return | Sakshi
Sakshi News home page

ఏనుగులు నాట్యం చేస్తుంటే.. పక్కకు తప్పుకోవాల్సిందే!

Nov 25 2026 8:11 AM | Updated on Nov 25 2026 8:11 AM

Uday Kotak on Nvidia CEO Jensen Huang Return

ఎన్‌విడియా హువాంగ్‌ రీఎంట్రీపై ఉదయ్‌ కోటక్‌ వ్యాఖ్య ..

చిప్‌ దిగ్గజం ఎన్‌విడియా సీఈవోగా జెన్సన్‌ హువాంగ్‌ను మరోసారి నియమించాలన్న నిర్ణయం.. ప్రపంచ మార్కెట్ల చరిత్రలోనే అత్యంత కీలక పరిణామమని ప్రముఖ బ్యాంకరు, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వ్యవస్థాపకుడు ఉదయ్‌ కోటక్‌ అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ రేసులో అమెరికాను ముందంజలో ఉంచాలనే రాజకీయ, ఆర్థిక అజెండాతో తీసుకున్న ఈ నిర్ణయంతో ఎన్‌విడియా మార్కెట్‌ క్యాప్‌ లక్ష కోట్ల డాలర్లు, అమెరికా మార్కెట్‌ విలువ 4 లక్షల కోట్ల డాలర్ల మేర పెరిగిందన్నారు.

దిగ్గజాల ఆధిపత్య పోరులో నిబంధనలకు తావుండదని ఇది తెలియజేస్తోందని ఆయన సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘తప్పో, ఒప్పో ఈ పరిణామంతో ఒక సందేశం ఇచ్చినట్లయింది. అదేమిటంటే, ప్రపంచ ఆధిపత్య పోరులో, దిగ్గజాలకు అనుకూలంగా నిబంధనలు మారిపోతుంటాయి. ఏనుగులు నాట్యం చేస్తే, మిగతా అందరూ పక్కకు తప్పుకుని, వాటికి చోటివ్వాల్సిందే’ అని ఎన్‌విడియా, అమెరికా పరిణామాలను ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: సారొచ్చారు.. బంగారాన్ని పెంచారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement