దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. సానుకూల గ్లోబల్ సంకేతాలతో ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ షేర్లు పురోగమించడంతో బెంచ్ మార్క్ సూచీలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 1,502.29 పాయింట్లు లేదా 1.82 శాతం పెరిగి 83,938.28 వద్ద ముగిసింది. నిఫ్టీ50 469.60 పాయింట్లు లేదా 1.85 శాతం పెరిగి 25,819.25 వద్ద స్థిరపడింది.
హిందుస్తాన్ యూనిలీవర్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ నిఫ్టీ50 సూచీలో టాప్ లాభాలు పొందాయి. రంగాలపరంగా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 3% లాభంతో మెరుగగైన ప్రదర్శన కనబరించింది. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ సీఎస్యూ బ్యాంక్ రాణించింది.


