SBIలో జోరుగా నియామకాలు.. | SBI Recruitment 2026 1540 Junior Associates 12000 Jobs | Sakshi
Sakshi News home page

SBIలో జోరుగా నియామకాలు.. బ్యాంకులో చేరిన 1,540 మంది కొత్త ఉద్యోగులు

Nov 27 2026 2:34 PM | Updated on Nov 27 2026 2:56 PM

SBI Recruitment 2026 1540 Junior Associates 12000 Jobs

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కొత్తగా 1,540 మంది జూనియర్‌ అసోసియేట్స్‌ను రిక్రూట్‌ చేసుకున్నట్లు తెలిపింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవ్యాప్తంగా బ్యాక్‌లాగ్‌ వేకెన్సీలను భర్తీ చేసేందుకు స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా రిజర్వ్‌డ్‌ కేటగిరీ నుంచి వీరిని నియమించుకున్నట్లు వెల్లడించింది.

వీరు కస్టమర్‌ సపోర్ట్, సేల్స్‌ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తారు. సెప్టెంబర్‌ 16న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించగా, అక్టోబర్‌ 29న మెయిన్‌ ఎగ్జామ్‌ నిర్వహించారు.  
2027 ఆర్థిక సంవత్సరంలో క్లరికల్, ఆఫీసర్‌ కేడర్లలో దాదాపు 11,000–12,000 మందిని రిక్రూట్‌ చేసుకునే ప్రణాళికల్లో భాగంగా ఈ నియామకాలు చేపట్టినట్లు వివరించింది. ప్రస్తుతం ఎస్‌బీఐలో 2.47 లక్షల మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని, కస్టమర్ల మారుతున్న అంచనాలకు అనుగుణంగా సేవలందించేందుకు సర్వసన్నద్ధంగా ఉండేలా ఉద్యోగులకు నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు.

రిజర్వ్‌డ్‌ కేటగిరీల్లో బ్యాక్‌లాగ్‌ వేకెన్సీలను నిర్దిష్ట వ్యవధిలో భర్తీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఎస్‌బీఐ కుటుంబంలో భాగమయ్యేందుకు, దేశ ప్రగతికి తమ వంతు తోడ్పాటు అందించేందుకు అవకాశాలు కల్పించడానికి ఎస్‌బీఐ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement