వైద్యుడి నుంచి ఐపీఎస్‌గా.. | - | Sakshi
Sakshi News home page

వైద్యుడి నుంచి ఐపీఎస్‌గా..

Jul 1 2023 1:00 AM | Updated on Jul 1 2023 1:00 PM

చిన్నారిని పరీక్షిస్తున్న ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ (ఫైల్‌)  - Sakshi

చిన్నారిని పరీక్షిస్తున్న ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ (ఫైల్‌)

భద్రాచలం ఏఎస్పీగా విధులు నిర్వర్తించి, ప్రస్తుతం జిల్లా ఎస్పీగా ఉన్న డాక్టర్‌ వినీత్‌ ఎంఎస్‌ ఆర్థోపెడిక్‌ వైద్యుడే. బెంగళూరులో మెడిసిన్‌ పూర్తి చేసుకుని, సంజయ్‌గాంధీ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తూనే సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు.

మొదటి ప్రయత్నంలోనే సివిల్‌ సర్వీసెస్‌కు ఆయన అర్హత సాధించారు. భద్రాచలం ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సమయాన దుమ్ముగుడెం పోలీసులు, పర్ణశాల పీహెచ్‌సీ ఆధ్వర్యాన ములకలపల్లిలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఏఎస్పీగా హాజరైన వినీత్‌.. వైద్యుడిగా మారిపోయి స్థానికులకు పరీక్షలు నిర్వహించడం విశేషం. ఇక్కడే కాదు ఏ శిబిరంలో సమయం లభించినా వైద్యుడిగా సేవలందించేందుకు వినీత్‌ ఇష్టపడతారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement