చుంచుపల్లి/రుద్రంపూర్: సింగరేణి ప్రధానాస్పత్రిని డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ బుధవారం తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలు, వైద్య సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. వివిధ వార్డులు, ఆపరేషన్ థియేటర్, ఎక్స్‌రే, ఇమ్యునైజేషన్ విభాగాలను పరిశీలించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ , ప్రోగ్రాం ఆఫీసర్ ఈట ప్రతాప్, నాగభూషణం, రాంప్రసాద్, సింగరేణి హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
చర్యలు తీసుకోవాలి
దుమ్ముగూడెం మండలం కోయినవారిపురం గ్రామంలో ఆశా కార్యకర్తపై దాడి ఘటనకు కారకులపై చర్యలు తీసుకోవాలని ఆశాల యూనియన్ నాయకులు డీఎంహెచ్‌ఓకు బుధవారం వినతిపత్రం సమర్పించారు.


