భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు | - | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు

Feb 24 2024 1:22 AM | Updated on Feb 24 2024 9:04 AM

- - Sakshi

లక్కిరెడ్డిపల్లె: అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ టికెట్‌ ను మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డికి కేటాయించడంపై ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రమేష్‌ కుమార్‌ రెడ్డి వర్గీయులు భగ్గుమన్నారు. టీడీపీ పదవులకు శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు రమేష్‌ రెడ్డి అనుచర వర్గం ప్రకటించింది. మరో మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్‌ రెడ్డి అనుచరులు కూడా రాంప్రసాద్‌ రెడ్డికి టికెట్‌ కేటాయించడంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో టీడీపీ జెండాలను ,కరపత్రాలను లక్కిరెడ్డిపల్లి ముడు రోడ్ల కూడలిలో నిప్పు పెట్టి దగ్ధం చేశారు. చంద్రబాబు నాయుడు పోస్టర్ల పైన చెప్పులతో చితకబాదుతూ టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డబ్బుకు అమ్ముడుపోయిన చంద్రబాబు డౌన్‌ డౌన్‌, లోకేష్‌ డౌన్‌ డౌన్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.


Advertisement
Advertisement
 
Advertisement
Advertisement