ఆంధ్రప్రదేశ్: పండుగ వేళ బాణాసంచా అక్రమ నిల్వలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన భారీ టపాసుల డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులకు అందిన సమాచారంతో ఎమ్మిగనూరు ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా, అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన 240 బాణాసంచా బాక్సులను గుర్తించారు. దీంతో వాటిని పోలీసులు సీజ్ చేశారు.
అయితే, ఇంత పెద్ద మొత్తంలో బాణాసంచాను అనుమతులు లేకుండా ఎందుకు నిల్వ ఉంచారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న టపాసుల విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అలాగే అక్రమ నిల్వ, విక్రయాల వెనుక ఎవరున్నారు? అనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత.. ప్రయాణికుడి పక్కా ప్లాన్!


