సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. క్రెడిట్ చోరీ, ఓట్ చోరీ, డేటా చోరీ అంటూ ఆరోపణలు గుప్పించిన ఆయన.. చివరకు తమిళనాడు ప్రభుత్వంలోనూ చోరీకి పాల్పడ్డారంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
'క్రెడిట్ చోరీ.. ఓట్ చోరీ.. డేటా చోరీ.. చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ..’ అంటూ జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే, తమిళనాడు ప్రభుత్వంలో ఉద్యోగాల నుంచి తొలగించిన వ్యక్తులకే నారా లోకేష్ దగ్గరుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. అలాగే ఇవన్నీ రాష్ట్రంలో ‘దొంగల ముఠా’ చేస్తున్న దారుణాలంటూ మండిపడ్డ వైఎస్ జగన్.. ‘హే రామ్.. సేవ్ ఆంధ్ర!’ అంటూ తన ట్వీట్‌ను ముగించారు.
ఇదీ చదవండి: నారా దుశ్శాసనుడి చేతిలో ప్రజాస్వామ్యానికి “వస్త్రాపహరణం’’: వైఎస్ జగన్


