శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత.. ప్రయాణికుడి పక్కా ప్లాన్‌! | Shamshabad Airport Foreign Gold Seized Hyderabad Telangana | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత.. ప్రయాణికుడి పక్కా ప్లాన్‌!

Oct 6 2026 11:32 PM | Updated on Oct 6 2026 11:32 PM

Shamshabad Airport Foreign Gold Seized Hyderabad Telangana

ఫైల్‌ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. సుమారు రూ.2.25 కోట్ల విలువైన 1.48 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు ఈ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.

అయితే, అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని తరలించేందుకు ప్రయాణికుడు పక్కా ప్లాన్‌ వేసినట్లు తెలుస్తోంది. దుస్తుల కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పౌచ్‌లో బంగారాన్ని దాచినట్లు సమాచారం. అలాగే విమానంలో దాచిన బంగారాన్ని బయటకు తీస్తుండగా డీఆర్‌ఐ అధికారులు అతడిని పట్టుకున్నారు.

దీంతో ప్రయాణికుడి వద్ద ఉన్న 1.48 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.2.25 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అరెస్ట్‌ చేసి, బంగారం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఎక్కడికి తరలించాలనుకున్నాడు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఢిల్లీలో భూకంపం.. ఒక్కసారిగా కంపించిన భూమి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement