Tirumala: తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ | Huge Devotees Rush at Tirupati | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ

Jul 11 2024 8:55 AM | Updated on Jul 11 2024 10:04 AM

Huge Devotees Rush at Tirupati

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో  వేచి ఉన్న భక్తులు  ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 10 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(బుధవారం) స్వామివారిని 73,353 భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 28,444 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.54 కోట్లుగా లెక్క తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement