అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. పేలిన గ్యాస్‌ సిలిండర్‌ | Gas Cylinder Blast Sparks Massive Apartment Fire In Vijayawada, Check Out Photos Inside | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. పేలిన గ్యాస్‌ సిలిండర్‌

May 12 2026 3:53 PM | Updated on May 12 2026 4:03 PM

 Gas Cylinder Blast Sparks Apartment Fire in Vijayawada

విజయవాడ: పటమట ప్రత్యూష అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడో అంతస్తులో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఫైర్ అయిన సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి అపార్ట్‌మెంట్‌ గోడ కూలింది. దీంతో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ‍్యాయి. 

ఎగిసి పడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ఈ అపార్ట్‌మెంట్‌లోని 302 ఫ్లాట్‌లో ఏసీపీ సత్యానందం (1991 బ్యాచ్) నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన వీఆర్‌లో ఉన్నారు. కుటుంబ సభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement