TS Adilabad Assembly Constituency: ప్లాట్ల విక్రయంలో.. బోథ్‌ ఎమ్మెల్యేపై చీటింగ్‌ కేసు!
Sakshi News home page

ప్లాట్ల విక్రయంలో.. బోథ్‌ ఎమ్మెల్యేపై చీటింగ్‌ కేసు!

Oct 19 2023 2:28 AM | Updated on Oct 19 2023 8:07 AM

- - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావుపై చీటింగ్‌ కేసు నమోదైంది. బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ కేసు నమోదు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు హైదరాబాద్‌లో మంగళవారం కలిసిన సంగతి తెలిసిందే. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన ఆదిత్య ఖండేష్కర్‌కు మావల మండలంలోని బట్టిసావర్‌గాం శివారులో 2012లో రెండు ప్లాట్లను విక్రయించారు. ఆ తర్వాత 2019లో ఇవేప్లాట్లను సంతోష్‌ అనే మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చారు. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావుపై 409, 420 సెక్షన్ల కింద చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ సీఐ అశోక్‌ తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన వ్యాపార భాగస్వామి సుదర్శన్‌పై కూడా కేసు నమోదైనట్లుగా పేర్కొన్నారు. విచారణ జరుపుతున్నట్లుగా సీఐ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement