ఆదిలాబాద్(బేల): మండలంలోని దహెగాం క్రాస్ వద్ద సోమవారం బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఒకరు గాయపడిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భోరజ్ మండలంలోని సావాపూర్ గ్రామానికి చెందిన శంకర్ దహెగాం నుంచి తన స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, దహెగాం క్రాస్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. ప్రమాదంలో అతని తలకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు.


