రైతుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

రైతుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి

Jul 22 2026 2:29 AM | Updated on Jul 22 2026 2:29 AM

సంతనూతలపాడు: మండలంలోని గుమ్మళంపాడు, మంగమూరు సచివాలయాలను మంగళవారం సాయంత్రం జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి సందర్శించారు. జాయింట్‌ ఎల్పీఎంలపై జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి అధికారులతో సమీక్షించారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరించి పట్టాదారు పాస్‌ పుస్తకాలు మంజూరు చేయాలని జేసీ కల్పనా కుమారి తహసీల్దార్‌ ఎస్‌ఎల్‌.నారాయణరెడ్డిని ఆదేశించారు. పట్టాదారు పాసు పుస్తకాలు, సబ్‌ డివిజన్‌ సర్వే నంబర్ల సమస్యలపై రైతులతో జేసీ నేరుగా అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌ లేకుండా సత్వరమే రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు. జేసీ కల్పనా కుమారి వెంట తహసీల్దార్‌ నారాయణరెడ్డి, వీఆర్వోలు, మంగమూరు పంచాయతీ అభివృద్ధి అధికారి ఎన్‌.ప్రతాప్‌ కుమార్‌, ఎన్‌ఎస్పీ డీసీ సంఘ అధ్యక్షుడు నల్లూరి కృష్ణారావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement