నాగులుప్పలపాడు: దస్తావేజు లేఖర్ల పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరితో జారీ చేసిన జీవో నంబర్ 396 ను వెంటనే ఉపసంహరించుకోవాలని అమ్మనబ్రోలు సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని దస్తావేజు లేఖర్లు డిమాండ్ చేశా రు. దస్తావేజు లేఖర్ల ఆధ్వర్యంలో అమ్మనబ్రోలు గ్రా మంలో చేపట్టిన పెన్ డౌన్ నిరసన కార్యక్రమం రెండో రోజు సందర్భంగా దస్తావేజు లేఖర్లు మాట్లాడుతూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి దస్తావేజు లేఖర్ల పట్ల నిరంకుశ వైఖరి తో ప్రవేశ పెట్టిన జీవో విరమించుకోవాలన్నారు. ఆళ్ల నాగభూషణం, పాండురంగ విఠల్ సూరి, ముప్పవరపు వెంకటేశ్వరరావు, గాలి వెంకట నరశింహారావు, రవి, జయ, కిషోర్ పాల్గొన్నారు.


